కడుపులో 33.5 కేజీలు బిడ్డ కాదు గడ్డ.. వరల్డ్ రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

కడుపులో 33.5 కేజీలు బిడ్డ కాదు గడ్డ.. వరల్డ్ రికార్డ్

October 12, 2018

కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళను  పరీక్షించిన వైద్యులు షాక్ అయ్యారు. ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 33.5 కేజీల అండాశయ కణితి ఉన్నట్లు గుర్తించారు. దాన్ని విజయవంతంగా తొలగించి ఆమె కష్టం తీర్చారు.  కోయంబత్తూరులో జరిగిందీ ఉదంతం.Coimbatore Doctors Remove "World's Heaviest Ovarian Cancer Tumour as the woman suffered from the heavy tumorఊటీకి చెందిన వసంత పొత్తి కడుపు పెరుగుతూ పోతుండటం, తీవ్రమైన నొప్పి రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించింది. దీంతో వారు పరీక్షలు నిర్వహించి, కడుపులో అండాశయ కణితి ఉన్నట్లు తెలిపారు. అయితే అందుకు తాము వైద్యం అందించాలేమని అన్నారు. కొద్దిరోజులు అలాగే ఉన్న వసంత నొప్పితో నడవలేని స్థితికి చేరింది. శ్వాస తీసుకోవడానికే చాలా ఇబ్బంది పడింది.  అయితే కోయంబత్తూరులోని ఓ ఆస్పత్రి గురించి తెలుసుకుని అక్కడి వైద్యులను సంప్రదించింది.

పొత్తి కడుపులో అతిపెద్ద కణితిని మూడు గంటలపాటు శ్రమించి కణితిని తొలగించారు. కణితి బరువు 33.5 కేజీలుగా ఉంది. బయాప్సీకి పంపించగా అండాశయ కేన్సర్ అని నిర్ధారణ అయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద అండాశయ క్యాన్సర్కు చికిత్స చేసినట్లుగా వైద్యులు రికార్డు క్రియేట్ చేశారు. తాజా శస్త్రచికిత్సకు ఇప్పటికే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమోదం లభించింది. అదేవిధంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు రికార్డ్ను పంపనున్నట్లు వైద్యులు తెలిపారు.