రైలు పట్టాలపై పార్టీ..నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది - MicTv.in - Telugu News
mictv telugu

రైలు పట్టాలపై పార్టీ..నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది

November 14, 2019

Tracks..

ఎప్పుడూ రెస్టారెంట్లు, హోటళ్లలో పార్టీ చేసుకుంటే మజా ఏం ఉంటుంది అనుకున్నారు. భిన్నంగా రైలు పట్టాలపై పార్టీ చేసుకోవాలని నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఈ సరదా వారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన కోయంబత్తూరులో జరిగింది. అంతా కలిసి మద్యం మత్తులో ఉండగా ఓ రైలు వచ్చి వాళ్లపై నుంచి దూసుకెళ్లింది. నలుగురు విద్యార్థులు ఆ చీకిట్లోనే కన్నుమూశారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. 

స్థానికంగా ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ చదివే  సిద్ధిఖ్ రాజా (22), రాజశేఖర్ (20), గౌతమ్ (23), కురుస్వామి (24), విఘ్నేశ్ అంతా కలిసి పార్టీ చేసుకోవాలని అనుకున్నారు. ఎక్కువగా రైళ్లు రానిచోటు కోసం వెతికి రౌతర్ పాలం రైల్ ఓవర్‌ బ్రిడ్జి ఎంపిక చేసుకున్నారు. అంతా కలిసి మద్యం తాగి మత్తులో ఉన్నారు. ఆ సమయంలో చెన్నై – అల్లప్పుంజా ఎక్స్‌ ప్రెస్ రైలు వచ్చింది. దాని రాకను ఎవరూ గమనించలేదు. దీంతో వారిపై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడే మరణించారు. విఘ్నేష్ మాత్రం తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.