యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

February 24, 2022

yudam

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా కుప్పకూలాయి. దలాల్ స్ట్రీట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతనమవడంతో బ్రడ్ బాత్ కొనసాగింది. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద కేవలం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. భారత స్కాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచీ అత్యధికంగా 2,800 పాయింట్లు కోల్పోయి 54,530 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో జాతీయ స్థాక్ ఎక్ఛేంచ్ నిఫ్టీ సూచీ సైతం 815 పాయింట్లు కోల్పోయి, 16,248 పాయింట్ల వద్ద ముగిసింది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ 2,164 పాయింట్లు పతనమై.. 35,228 పాయింట్ల వద్ద ముగిసింది.

మరోపక్క ఉక్రెయిన్‌పై రష్యా వార్ డిక్లేర్ చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. గురువారం ఉదయం నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ బెంబేలెత్తిపోతోంది. అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్నరష్యా… ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే దిశగా వెళ్తోన్న విషయం తెలిసిందే.