Collapsed under construction building in Kukatpally
mictv telugu

కూకట్‌పల్లిలో కూలిన 4 అంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద కార్మికులు!

January 7, 2023

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. 4, 5 అంతస్తులకు శ్లాబ్ వేస్తుండగా కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇంకా శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. అటు విషయం తెలియగానే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఫైర్, రెస్క్యూ టీంలను రప్పించి శిథిలాలు తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యారు. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. నాణ్యతాలోపం ఏమైనా ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అని వివరాలు సేకరించే పనిలో అధికారులు, కార్మికులు ఉన్నారు.