‘ఆమ్రపాలి’కి రంగు పడింది...! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆమ్రపాలి’కి రంగు పడింది…!

August 26, 2017

కలెక్టర్ ఆమ్రపాలి విగ్రహం వివాదం రేపుతోంది. వరంగల్ జిల్లా కాజీపేటలో కలెక్టర్ ఆమ్రపాలి మీదున్న అభిమానంతో కొందరు ఆమె బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ ఒడిలో గణేశుడి విగ్రహాన్ని ఉంచి పూజిస్తుండటం తెలిసిందే. ఆ విగ్రహం ఫేస్ బుక్కుల్లో ,వాట్సప్పుల్లో  విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే చాలా చోట్లనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చేసేదేం లేక  కలెక్టర్ మేడం ముఖానికి  నల్లరంగు పూశారు. కనీ ఎందుకచ్చిన ఆర్భాటం…మేడం మీద అంతగానం అభిమానం ఉంటే, ఆమె లెక్క పెద్ద సద్వులు సద్వి కన్నోళ్లకు  మంచి పేరు తేవాలె గనీ…గిట్ల జేసుడేంది? అరే మేడం ఏమన్న మీకు పిల్శి జెప్పిందా నా విగ్రహం పెట్టుమని? ఇప్పుడు జూడున్రి ఆర్బాటానికి  మేడం విగ్రహం పెడ్తిరి, ఆ తర్వాత మొఖానికి నల్లరంగు పూస్తిరి. అట్టిగనే మేడంను బద్నాం జేసుడు కాకపోతే …ఇంకేంది ?అని చాలామందే గరమైతున్నరు.