ఈ కలెక్టర్ రూటే సెపరేటు... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కలెక్టర్ రూటే సెపరేటు…

June 20, 2017

అధికారులు కొందరుంటరు…. అట్లా ఉంటరు. నేం  ప్లేట్…హోదాకు హోదా ఉంటుంది. అంత వరకే ఉంటరు. కానీ కలెక్టర్ మురళీ రూటే వేరు. ఈయన ఏం చేసినా సంచలనమే. ఏం మాట్లాడినా  అంతకు మించిన సంచలనం.  ఇంతకు ముందు  ఏం చేశారో అందరికీ  తెల్సిందే. తాజాగా కలెక్టర్ మురళీ వేసిన ఓ అడుగు మరింత మందిని ఆలోచించేటట్లు చేస్తున్నది. సర్కారు బడుల గురించి తెగ బాధపడిపోయేవాళ్లు…. అధికారులతో సమీక్షలు చేసి మమ అన్పించే  ఆఫీసర్లు చానా మందే ఉంటరు. సర్కారు బడులను, దాంట్ల సద్వే పిల్లల భవిష్యత్తు గురించి బట్ట పర్చి మరీ విరాళాలు అడిగిండు.  ఓ కలెక్టర్ ఇట్లా చేయడం తప్పా… ఒప్పా… తర్వాత విషయం.  సహజంగా ప్రభుత్వ బడుల్ల చదివే పిల్లలు కింది సామాజిక వర్గాల వారే కదా. వాళ్ల కోసం ఇట్లా చేయడం తప్పు కాదు కద. బెంచీ కింద చేతులు పెట్ట లేదు.. ఫలనా ఫైలా… చూద్దాం… చేద్దం అనలేదు. మారుమూల ప్రాంతంలోని పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే తపన తప్ప మరేం లేనట్లుంది మురళీ సారుకు.దాని కోసం ఇంత చేయాల్నా అంటే… కొన్ని సార్లు తప్పదుకావొచ్చు మరి. ఏదైనా  కలెక్టర్ కథనే వేరు.