కలెక్టర్లకు కష్టాలున్నాయట.. మీటింగ్ పెట్టుకున్నారు ! - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్టర్లకు కష్టాలున్నాయట.. మీటింగ్ పెట్టుకున్నారు !

July 14, 2017

ఎప్పుడు చూసినా సామాన్య జనాలకేనా కష్టాలు ? వాళ్ళకేనా కన్నీళ్ళు ? వాళ్ళు మాత్రమేనా మనుషులు ? కలెక్టర్లకుండావా కష్టాలు ? అనుకున్నట్టున్నారు కలెక్టర్లందరూ ఏకమై తమ కష్టాలను గోడులా వెళ్ళబోసుకున్నారు. కలెక్టర్ల కష్టాలు కలెక్టర్లకే తెలుస్తాయని అందరూ గ్రూపుగా గూడుపుఠానీ కాదు కాదు గుండె బాధలను ఒకరికొకరు చెప్పుకొని బావురుమన్నారు. ఐఏఎస్ అంటే నాటే జోక్ ప్రజలందరి కష్టాలు, సమస్యల లిస్టు వాళ్ళ దెగ్గరుంటుంది. కాబట్టి విపరీతమైన స్ట్రెస్ చాలా వుంటుంది. ప్రజల కష్టాలు తీర్చే వాళ్ళకే కష్టాలొస్తే వాళ్ళెళ్ళి ఎవరి ముందు మొర పెట్టుకోవాలి ? వ్యక్తిగతంగా వాళ్ళకంటూ ఒక సమయమూ, సందర్భమూ ఏమీ వుండకుండా 24 అవర్స్ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే కలెక్టర్లు ప్రజాసేవలో తాము కోల్పోతున్నదెంత ? రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా ఎంతమంది కలెక్టర్లు నరకయాతన అనుభవిస్తున్నారు వంటివి చర్చించుకొన్నారట. వాటికి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించే పనిలో అధికారుల దెగ్గరికి వెళ్ళనున్నారు.

ఈ కార్యక్రమంలో వాళ్ళంత ముఖ్యంగా మహబూబా బాద్ ఘటన మీద ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇంకా ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటున్నారనే కోణంలో కూడా వాళ్లంతా చాలా డీప్ గా డిస్కస్ చేసి అందరూ ఏకసభ్యంగా ఒక నిర్ణయానికొచ్చి సిఎస్ ఎస్పీ సింగ్ ను కలిసి తమ కష్టాల కన్నీళ్ళను పారబెట్టనున్నారట. చూసారా.. ఈ ప్రపంచంలో ఏదీ లేనివారికే కాదు అన్నీ వున్నవాళ్ళకు కూడా కష్టాలు, కడగండ్లు వుంటాయి కదూ !