గుట్టల్లో జోరుగా హుషారుగా కలెక్టర్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

గుట్టల్లో జోరుగా హుషారుగా కలెక్టర్లు..

July 17, 2017

నిత్యం బిజీగా ఉండే కలెక్టర్లు ప్రకృతిని చూసి పరవశించి పోయారు. గుట్టలపై ఐదుగంటలు జోరుగా హుషారుగా నడిచారు. వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతీ మీనా కుటుంబ సభ్యులతో కలిసి బయ్యారం చెరువు, పెద్ద గుట్ట టూరిజం స్పాట్‌కు వెళ్లారు. తొలుత ఖనిజ నిక్షేపాలు పొదిగి ఉన్న బయ్యారం ఐరన్ ఓర్ గుట్టను సందర్శించారు. పెద్ద గుట్టపై 5 గంటల పాటు 12 కిలోమీటర్ల మేర నడిచారు. అక్కడ నుంచి కాకతీయుల కాలం నాటి బయ్యారం పెద్ద చెరువు దగ్గర అలుగు మత్తడిని చూశారు. చెరువు కట్టపై ఉన్న శిలాఫలకాన్ని చూపిస్తూ అధికారులు దాని ప్రాముఖ్యతను కలెక్టర్లకు వివరించారు.