గేర్ మార్చిన కాలేజీ గర్ల్స్..డ్రైవర్ సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

గేర్ మార్చిన కాలేజీ గర్ల్స్..డ్రైవర్ సస్పెండ్

November 19, 2019

బస్సు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ చిన్న తప్పిదం చేసినా ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అలాంటిది ఓ టూరిజం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి హద్దూ అదుపు లేకుండా పోయింది. కేరళ నుంచీ గోవా వెళ్తున్న టూరిజం బస్సులో కాలేజీ అమ్మాయిలు ప్రయాణిస్తున్నారు. వాళ్ల కన్ను గేర్ రాడ్డుపై పడింది. డ్రైవర్ వెనకాలే వెళ్లి కూర్చున్నారు. ప్లీజ్ మేం గేర్లు మార్చచ్చా అని అడిగారు. 

మొదట ఆ డ్రైవర్ ఆశ్చర్యపోయి చూశాడు. తరువాత సరే కాలేజీ అమ్మాయిలు ముచ్చట పడుతున్నారని చిన్నగా నవ్వాడు. అంతే డ్రైవర్ నవ్వును పర్మిషన్‌గా భావించిన అమ్మాయిలు గేర్ రాడ్డుతో ఆదుకోవడం మొదలు పెట్టారు. వాళ్లకు నచ్చినట్టుగా తిప్పసాగారు. అది గమనించిన డ్రైవర్ మధ్యమధ్యలో తనే గేర్ సెట్ చేస్తూ ముందుకుసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆర్టీవో అధికారులకు విషయం తెలిసింది. డ్రైవర్ ను కేరళలోని వాయనాడ్‌కు చెందిన షాజీగా గుర్తించి అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటూ సస్పెండ్ చేశారు.