collge girs fighting in nashik
mictv telugu

చితక్కొట్టుకున్న కాలేజ్ అమ్మాయిలు..

November 19, 2022

collge girs fighting in nashik

మనం అబ్బాయిలను రోడ్డు మీద తన్నుకోవడం కామన్‌గా చూస్తాం. కొన్నిసార్లు కాలేజ్ గొడవలతో రోడ్డెక్కి రచ్చచేస్తారు. కానీ ఈ మధ్య అమ్మాయిలు సైతం ఫైటింగ్‌లకు దిగుతున్నారు. రోడ్డుపైనే చెడా మడా కొట్టుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర నాసిక్‌లో కాలేజ్ అమ్మాయిలు మధ్య జరిగిన గొడవ వైరల్‌గా మారింది.

కాలేజ్‌లో క్యాంటీన్ సీట్లకోసం ఇద్దరు అమ్మాయిల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి ఒకరి జుట్టు ఒకరు పట్టుకున్నారు. క్యాంటీన్‌లో గొడవ వద్దని పంపివేయడంతో అక్కడి నుంచి నేరుగా రోడ్డుపైకి వచ్చి కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.. పక్కన ఉన్నవారు అడ్డగించినా తగ్గేదే లే అంటూ చితక్కొట్టుకున్నారు. చుట్టూ అబ్బాయిలు ఉన్నా వెనుకడుగు వేయలేదు. ఈ ఫైటింగ్ వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ఇటీవల ఏపీలోనూ అమ్మాయిలు రోడ్డుపై తన్నుకున్న ఘటనలు మనం చూశాం. ఓ ప్రియుడి కోసం విశాఖలో ఇద్దరు అమ్మాయిలు కిక్ బాక్సింగ్ ఆడగా.. విజయవాడ నడిరోడ్డుపై కాలేజ్ అమ్మాయిలు కొట్టుకున్నారు.