ఇంత అందమున్నా ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టను - MicTv.in - Telugu News
mictv telugu

ఇంత అందమున్నా ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టను

November 11, 2022

అందంగా ఉండే అమ్మాయిలు సాధారణంగా పేరు, డబ్బు కోసం మోడలింగ్, సినిమా, సీరియల్ అవకాశాలను వెతుక్కుంటారు. లేదా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటారు. కానీ, అమెరికాలోని కొలంబియాకు చెందిన డయానా రమిరెజ్ మాత్రం చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని వదలనంటోంది. ఈమె ప్రపంచంలోనే అందమైన పోలీస్ ఆఫీసర్‌గా పేరు గాంచింది. డయానాను యూనిఫాంలో చూసిన వారంతా ఎందుకు పోలీస్ జాబ్ చేస్తున్నావు.

మోడలింగ్ చేయవచ్చు లేదా ఆన్లైన్ ఇన్‌ఫ్లుయెర్‌‌గా పని చేయవచ్చు కదా అని సలహా ఇస్తుంటే అమ్మడు మాత్రం మళ్లీ కెరీర్‌‌ని ఎంచుకునే అవకాశం వస్తే పోలీస్ వృత్తినే ఎంచుకుంటానని కరాఖండీగా చెప్తోంది. తనకు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టమని, చాలా గౌరవంగా భావిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ మధ్యే డయానా బెస్ట్ పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్ అయ్యింది. దాంతో డయానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే డయానా పోలీస్ విధులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరొందిన మెడిలిన్‌లో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తోంది. అందంతో పాటు ఆమె ధైర్యసాహసాలకు కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈమెకు ఇన్‌‌స్టాగ్రాంలో నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం.