Colonel Geeta Rana, who created history.. the first woman officer to lead a field workshop..!
mictv telugu

చరిత్ర సృష్టించిన కల్నల్ గీతా రాణా.. ఫీల్డ్ వర్క్‌షాప్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి..!

March 9, 2023

Colonel Geeta Rana, who created history.. the first woman officer to lead a field workshop..!

నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ప్రతిరంగంలోనూ తమ సత్తా చాటుతూ..ప్రపంచ పటంలో భారత్ పేరును వెలిగిస్తున్నారు. ఇండియన్ ఆర్మీలోనూ మహిళలు తమ సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కల్నల్ గీతా రాణా చరిత్ర సృష్టించింది. కల్నల్ గీతా రాణా ఓ పెద్ద ఘనత సాధించిన విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

తూర్పు లఢఖ్ లోని ఫార్వర్డ్, రిమోట్ ఏరియాలో ఫీల్డ్ వర్క్ షాప్ కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారికగా కల్నల్ గీతా నిచిచారని అధికారులు తెలిపారు. గీతా రాణా ప్రస్తుతం కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ లో కల్నల్ గా ఉన్నారు. తూర్పు లడఖ్ లోని ఫార్వర్డ్ , రిమోట్ లొకేసన్ లో ఇండిపెండెంట్ ఫీల్డ్ వర్క్ షాప్ కమాండ్ ను తీసుకున్న మొదటి మహిళా అధికారిగా చరిత్ర క్రియేట్ చేశారు. ఈ బాధ్యతను స్వీకరించడంతో గీతారాణా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. మిలటరీ అధికారులు కూడా ఆమెను ప్రశంసించారు.