సముద్ర గర్భంలో లక్షల కోట్ల బంగారు నిధి గుర్తింపు! - Telugu News - Mic tv
mictv telugu

సముద్ర గర్భంలో లక్షల కోట్ల బంగారు నిధి గుర్తింపు!

June 10, 2022

17 వ శతాబ్ధంలో (1708 సంవత్సరంలో) జూన్ 8వ తేదీన కొలంబియాలోని కార్టాజినా తీరంలో శాన్ జోస్ యుద్ధ నౌక అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని సముద్రంలో మునిగిపోయి అదృశ్యమైపోయింది. ఆ నౌక శిథిలాల సమీపంలో ఇటీవల కనుగొన్న రెండు నౌకలలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ నివేదిక పేర్కొంది. అందులోని బంగారం విలువ 17 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.27 లక్షల కోట్లు) ఉంటుందని తెలిపింది. బ్రిటిష్ వారితో యుద్ధం చేసే కాలంలో శాన్ జోస్ నౌక తో పాటు దానిలో ఉన్న పాటు దాదాపు 600 మంది మనుషులు, 2000 వేల కోట్ల డాలర్ల విలువ చేసే బంగారం, వెండి, ఆభరణాలు కూడా నీటి పాలయ్యాయి. ఆ నౌక శతాబ్దాలుగా సాగరగర్భంలో ఆచూకీ తేలకుండా ఉండిపోయింది. కానీ 2015 సంవత్సరంలో దీని చుట్టూ ఉన్న రహస్యం వీడిపోవటం మొదలైంది. అది ఎక్కడుందో కనుగొన్నామని కొలంబియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. స్పెయిన్ ప్రభుత్వం తాజాగా నౌక మునిగిపోయి ప్రదేశానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

రిమోట్ కంట్రోల్డ్ వాహనం సాయంతో.. ఈ నౌక ఉన్న ప్రాంతంలో కరేబియన్ తీరానికి 3,100 అడుగుల లోతులో వీడియో రికార్డ్ చేసింది. సముద్రపు అడుగుభాగంలో చెల్లాచెదురుగా ఉన్న బంగారు నాణేలు, కుండలు, చెక్కుచెదరకుండా ఉన్న పింగాణీ కప్పులను వీడియోలో చూడొచ్చు. సముద్ర గర్భంలో శతాబ్దాలుగా ఉన్నా ఓడల్లో ఒకదాని విల్లు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, వివిధ రకాల మట్టి కుండలతోపాటు ఫిరంగులను కూడా చూడవచ్చని పేర్కొంది. స్పెయిన్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్.. దీని గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో టెక్నాలజీ సాయంతో, పక్కా ప్రణాళికలు రచించి తమ వారసత్వ సంపదను చేజిక్కించుకుంటామని తెలిపారు.