తుపాకీ పట్టుకోవడం వచ్చా.. అయితే సైన్యంలో చేరండి: ఉక్రెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

తుపాకీ పట్టుకోవడం వచ్చా.. అయితే సైన్యంలో చేరండి: ఉక్రెయిన్

February 24, 2022

 

 

bhg

‘మీకూ దేశం కోసం పోరాడాలన్న కోరిక ఉందా.?, తుపాకీ పట్టుకోవటం వచ్చా.?’ అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే సైన్యంలోకి రావొచ్చని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ పిలుపునిచ్చారు. రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ ప్రాదేశిక భద్రతా బలగాల్లో సాధారణ పౌరులు కూడా చేరొచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఒలెక్సీ రెజ్నికోవ్ మాట్లాడుతూ.. “ఉక్రెయిన్ ప్రధాన సైన్యానికి అనుబంధంగా ప్రాదేశిక భద్రతా బలగాలు (టెరిటోరియల్ ఆర్మీ దళాలు) పనిచేస్తుంటాయి. అత్యవసర సమయాల్లో సైన్యానికి వెన్నుదన్నుగా ఈ ప్రాదేశిక దళాలు కూడా సేవలు అందిస్తుంటాయి. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారు చేరే వీలుంటుంది. చేతివృత్తులవారు, టెక్ నిపుణులు, క్రీడాకారులు ఎవరైనా చేరొచ్చు. తద్వారా దేశానికి సేవ చేసుకునే ఈ అవకాశాన్ని సాధారణ పౌరులకు సైతం కల్పిస్తున్నాం” అని అన్నారు.

మరోపక్క రష్యా ఉక్రెయిన్‌పై తీవ్రస్థాయిలో బాంబు దాడులు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ బలగాలు రష్యా దాడులకు భయపడి లొంగిపోతున్నాయి అని వార్తలు వస్తున్న తరుణంలో ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఆసక్తికరమైన ప్రకటన చేశారు.