రైళ్లను తగలబెట్టడానికి రండి.. వాయిస్ మెసేజ్‌లు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లను తగలబెట్టడానికి రండి.. వాయిస్ మెసేజ్‌లు వైరల్

June 18, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్యేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఘటన దేశ్యావ్యాప్తంగా సంచలనం రేపింది.‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా నిరసకారులు రైళ్లకు నిప్పు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి కొన్ని వాట్సాప్ మేసేజ్‌లు, వాయిస్ మేసేజ్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విధ్వంసం ముందస్తు పథకం ప్రకారం జరిగిందేనా? అనే అనుమానులు రేకెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు, చాటింగులను చూస్తుంటే అవుననే మాట స్పష్టంగా వినిపిస్తుంది. ఆ సందేశాల్లో..” రైళ్లను తగలబెట్టడానికి అందరు రండి’ అంటూ పిలుపునిచ్చినట్లు ఉండడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనక ఎవరు ఉన్నారు? ఎవరు ఆ వాయిస్ మేసేజ్‌లు పంపించారు? అనే వాటిపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు శుక్రవారం జరిగిన హింసాకాండ సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్‌లో శనివారం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్, సీఆర్పీపీఎఫ్, రైల్వే, తెలంగాణ పోలీసు బలగాలను స్టేషన్ వద్ద పహరా కాస్తున్నారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, లోపలికి పంపిస్తున్నారు. స్టేషన్ పరిసరాల్లో జనం పెద్ద ఎత్తున గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిలిచిపోయిన రైళ్లు నేడు భారీ బందోబస్తు మధ్య అధికారులు నడుపనున్నారు.