హిజాబ్ లేనిదే క్లాసులకు రాము.. ప‌రీక్ష‌లు రాయము - MicTv.in - Telugu News
mictv telugu

హిజాబ్ లేనిదే క్లాసులకు రాము.. ప‌రీక్ష‌లు రాయము

March 16, 2022

mmm

కర్ణాటక రాష్ట్రాన్ని గతకొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం రోజు రోజుకు ముదిరి జాతీయ, అంతర్జాతీయ సమస్యగా మారింది. దీంతో పలు దేశాలకు చెందిన నాయకులు, సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు తమ తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అయితే ఈ వివాదంపై సుధీర్ఘ చర్చలు జరిపిన కర్ణాటక హైకోర్ట్ మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. విద్యాల‌యాల్లోకి హిజాబ్‌కు అనుమ‌తి లేద‌ని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి చెందిన ఓ ముగ్గురు ముస్లిం విద్యార్ధినిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి హిజాబ్‌ను అనుమ‌తించేదాకా క్లాసుల‌కు వెళ్ల‌ామని శపథం చేశారు. అంతేకాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయం లేదని, సరైన న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈ క్రమంలో శపథం చేసినట్లుగానే అనుకున్నంత పని చేశారు. బుధవారం వాళ్లంతా క్లాసుల‌కు డుమ్మా కొట్టారు. తమ కళాశాలలో జరుగుతున్న పరీక్షాలకు గైర్హాజ‌ర‌య్యారు.