టాలీవుడ్‌పై కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్‌పై కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు

May 31, 2022

కమెడియన్ అలీ టాలీవుడ్‌లో ఇటీవల పెరుగుతున్న పెడ ధోరణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క వారి సినిమాలు ఫ్లాప్ అయితే సంతోషపడేవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని పేర్కొన్నారు. ఒక సినిమా ఫెయిలయితే ఇంకో సినిమా వాళ్లు చంకలు గుద్దుకుంటున్నారని, ఇదేం దురదో అర్ధం కావట్లేదన్నారు. ‘ఈ మధ్య కాలంలో ఈ ధోరణి ఎక్కువైంది. ఇలాంటి చెడు మనస్తత్వం నుంచి బయటికి రావాలి. పక్కవాళ్ల బాగు కోరుకుంటే మనకు అంతకు మించి మంచి జరుగుతుంద’ని అభిప్రాయపడ్డారు. తాను రీసెంట్‌గా నటించిన ఎఫ్3 సినిమా విషయంలో ఇది జరుగుతోందని, హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాని కూడా బాగాలేదని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలా చేసేవాళ్లు తాము కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎఫ్3 సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారని, మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 60 కోట్లను వసూలు చేసిందన్నారు. కేవలం నైజాంలోనే తొమ్మిదిన్నర లక్షల మంది సినిమాను చూశారని, సోమవారం కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ అవడం సంతోషంగా ఉందని చెప్పారు.