కామెడీ, హీరోయిజం అయిపోయిది.. ఇక  విలన్‌‌గా సునీల్ - MicTv.in - Telugu News
mictv telugu

కామెడీ, హీరోయిజం అయిపోయిది.. ఇక  విలన్‌‌గా సునీల్

February 28, 2020

Sunil

హాస్యనటుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగానూ తనదైన ముద్రవేశాడు. హీరోగా కలిసి రాకపోవడంతో మళ్లీ సినిమాల్లో కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. ఇదంతా కాదని తనలోని నటుడుని మరో కోణంలో ఆవిష్కరించడానికి సునీల్ సిద్ధం అయ్యాడు. విలన్‌గా నటించడానికి ఓ చిత్రాన్ని ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ వంటి స్పూఫ్‌ సెటైరికల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమృత ప్రొడక్షన్స్ ‘కలర్ ఫోటో’ అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరోగా నటిస్తుండగా.. చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. 

విలన్ ఎస్ రామ‌రాజు పాత్ర‌ను సునీల్ ధరించనున్నాడు. ఈ రోజు సునీల్ పుట్టినరోజు  సంద‌ర్భంగా క‌ల‌ర్ ఫోటో చిత్రం నుండి సునీల్ లుక్ విడుద‌లైంది. ఇందులో సునీల్ చాలా ఆవేశంతో క‌నిపిస్తున్నాడు. కాగా, యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యం.యం.కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథగా తెరకు ఎక్కిస్తున్నారు.