comedian Prithvi's daughter Sreelu has become a heroine
mictv telugu

హీరోయిన్‌గా మరో వారసురాలు.. వెల్లడించిన ప్రముఖ కమెడియన్

June 1, 2022

comedian Prithvi's daughter Sreelu has become a heroine

సినీ ఇండస్ట్రీలో వారసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు అబ్బాయిలు ఎక్కువ సంఖ్యలో పరిశ్రమకి వచ్చారు. అమ్మాయిలను రానిచ్చేవారు కాదు. కానీ, ఈ మధ్య ఆ ట్రెండు మారింది. చాలా మంది నటీనటులు తమ కూతుళ్లను కూడా సినిమాల్లో నటించేలా ప్రోత్సహిస్తున్నారు. కమల హాసన్, అర్జున్, రాజశేఖర్, ఉత్తేజ్ వంటి వారు తమ కూతుళ్లను ఇప్పటికే ఈ వరుసలో ముందంజలో ఉన్నారు.

ఇప్పుడు స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లు తమ తమ కూతుళ్లను ఆ విధంగా ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నారు. మహేశ్ అయితే కూతురు సితార భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తుందని ప్రకటించేశారు కూడా. ఇప్పుడు ఈ వరుసలో ప్రముఖ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ నిలిచారు. ఆయన కూతురు శ్రీలు హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని, ఆ సినిమా వివరాలు వెల్లడించారు. ‘మా అమ్మాయి హోటల్ మేనేజ్‌మెంట్ చదివి మలేషియాలో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ, మధ్యలో సినిమాల మీద మక్కువతో సినీ రంగం వైపు వచ్చేసింది. తనను ఎప్పుడో పరిచయం చేద్దామనుకున్నా కానీ, కుదరలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ కుమారుడు హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేసింది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుంటాను’ అని అన్నారు.