ఆస్పత్రిలో చేరిన పృథ్వీ.. కరోనా లేకపోయినా..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్పత్రిలో చేరిన పృథ్వీ.. కరోనా లేకపోయినా.. 

August 4, 2020

Comedian Prudhvi admitted to hospital .. without corona ......

కరోనా కనికరించి వదిలి పెడుతోంది ఎందరిని? అందరికీ తన సత్తా ఏంటో చూపిస్తానంటోంది. తాజాగా తెలుగు సినిమా హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్వీ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పది రోజుల నుంచి ఆయన తీవ్ర జ్వరం, జలుబు లక్షణాలతో బాధ పడుతున్నారు. దీంతో సోమవారం రాత్రి ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పృథ్వీ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. 

రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. అయినా నెగిటివ్‌గానే వచ్చిందని వీడియోలో వెల్లడించారు. సీటీ స్కానింగ్ కూడా చేయించుకున్నానని తెలిపారు. కొంత మందికి లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెప్పారని పృథ్వీ అన్నారు. జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లో చేరానని స్పష్టంచేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ.. అందరి ఆశీస్సులు, వెంకన్న దయతో త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తానని పేర్కొన్నారు.