వైకాపాలోకి వెళ్లే మొఖాలకైనా సిగ్గు, శరం ఉండాలి.. పృథ్వీరాజ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

వైకాపాలోకి వెళ్లే మొఖాలకైనా సిగ్గు, శరం ఉండాలి.. పృథ్వీరాజ్‌

June 21, 2022

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలేనితనంతో ప్రతిపక్షాలపై నోరు పారేసుకున్న మాజీ వైసీపీ నేత, కమెడియన్ (థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ) పృథ్వీరాజ్‌ కు మత్తు వదిలినట్లుంది. ఓ ఫోన్ కాల్ విషయంలో ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయి.. పార్టీ నుంచి తొలగించడంతో కొత్తగా జనసేన పవన్ కళ్యాన్ భజన చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా తాను గతంలో పనిచేసిన పార్టీపై తాజా ఇంటర్య్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఒకవేళ మళ్లీ జగన్ పిలిచి వైసీపీలోకి రమ్మంటే వెళ్లేందుకు సిద్ధమేనా అని అడిగిన ప్ర‌శ్న‌కు ‘‘చాలండి.. న‌మ‌స్కార‌మండి అని అంటాను. అంతేమాట. వెళ్లే మొఖాలకైనా సిగ్గు.. శ‌రం ఉండాలి. నేను ఎప్పుడూ నా కులం గురించి మాట్లాడ‌లేదు. ఫ‌స్ట్ టైమ్ చెబుతున్నాను. తూర్పు గోదావ‌రి జిల్లా చోళ్లంగిలో పుట్టిన ఒక కాపు బిడ్డ‌గా చెబుతున్నాను. అలాంటి ప‌నులు మా జాతిలో ఎవ‌డూ చేయ‌డు. మళ్లీ వెనక్కి తిరిగి చూడను. అంతా ముందుచూపే’’ అంటూ మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌నేలా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.