30 ఇయర్స్ ఇండస్ట్రీ ,30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒక్క డైలాగ్ తోని సినిమాల్లో చాలా ఫేమస్ అయ్యాడు పృథ్వీరాజ్ అనే కమేడియన్,తన కామేడీతో అందర్ని నవ్విస్తూ ప్రేక్షకులందరికీ బాగా దగ్గరయిండు కానీ నిజ జీవితంలో ఏమైందో ఏమో ఆయ్నకు… ఆయ్న భార్యకు మద్య మనస్పర్ధలు వచ్చినయ్,కోర్టులో కేసుగుడ నడుస్తుంది,ఆయన భార్య విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టింది..కోర్టు విచారణకు పృథ్వీరాజ్ హాజరు కాకపోవడంతో….నెల నెల 8 లక్షల రూపాయలు పృథ్వీరాజ్ తన భార్యకు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
పృథ్వీరాజ్ కొడుకు ఏమన్నాడంటే..?
పృథ్వీరాజ్ కొడ్కు మైకుల ముంగటకచ్చి దయచేసి మీడియాలో నాన్నమీదస్తున్న వార్తల్ను నమ్మద్దు,ఆయన కెరియర్‌కు భంగం కల్గియద్దు,ఆయన ఎంత కష్టపడి పైకొచ్చారో అందర్కి తెల్సు,అమ్మా నాన్నల మద్య సంవత్సరంనుంచి గొడవలు వున్నాయి..కానీ ఇలా మామదర్ కేసు పెడ్తుందని మేమెవ్వరం ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, ఎవలో శెప్పుడు మాటలు విని.. అమ్మ డాడీ మీద కేసు వెట్టింది…దయచేసి ఆయన్ను తప్పుగా అర్ధంచేస్కోకండి అని చెప్పిండు.ప్రస్తుతం పృథ్వీరాజ్ షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు,మరి తిరిగచ్చిన తర్వాత కోర్టు చెప్పినట్టు భార్యకు నెలకు 8 లక్షలు ఇస్తాడా లేకపోతే వారి ఇద్దరిమద్య మనస్పర్ధలు తొలిగిపోయి కల్సి ఉంటారా ఏమో చూడాలెమరి.