పెళ్లి అవ్వకుండానే తండ్రి ఏంటన్న.. కమెడియన్ రాహుల్ నిర్వాకంపై విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి అవ్వకుండానే తండ్రి ఏంటన్న.. కమెడియన్ రాహుల్ నిర్వాకంపై విమర్శలు

November 7, 2022

Comedian Rahul Ramakrishna Is Going To Become A Father,Rahul Ramakrishna, Rahul Ramakrishna Wife, Rahul Ramakrishna Girl Friend, Rahul Ramakrishna Trolls, Trlling On Rahul Ramakrishna, Arjun reddy, Pawan Kalyan, Living To Gether, Dating,

కాల్ షీట్స్ కాలిగున్నప్పుడు పెళ్లి చేసుకుందాం.. ముందైతే సహజీవనం కానిచ్చేద్దాం అనేది హాలీవుడ్ నుండి బాలీవుడ్ ఎత్తుకున్న ట్రెండ్. బాలీవుడ్ స్టార్స్ కి లివింగ్ టు గెదర్ చాలా కామన్. కత్రినా విక్కీ, కరీనా సైఫ్, దీపికా రణ్ వీర్, అలియా రణబీర్ వంటి యంగ్ మ్యారీడ్ కపుల్స్ అంత సహజీవనం తరువాతే పెళ్లిపీటలెక్కారు. అయితే ఈ ట్రెండ్ ని పేరున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ తొలిసారి టాలీవుడ్ కి పరిచయం చేశాడని విమర్శలు ఉన్నాయి. సహజీవనంలో పిల్లలని కన్న తరువాతే రేణుని పవన్ పెళ్లి చేసుకున్నాడని రూమర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తరువాత చాలామంది టాలీవుడ్ హీరో హీరోయిన్లకి లివింగ్ టు గెదర్ అలవాటైపోయింది. అయితే వారికంటే తానేమి తక్కువ కాదన్నట్టు.. అర్జున్ రెడ్డి కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా ఒక అమ్మాయిని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తూ.. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని మే నెలలో పోస్ట్ పెట్టాడు.

అయితే ఇప్పటివరకు ఆ పెళ్లి ఊసేలేదు. పెళ్లి డేట్ ఎప్పుడు చెప్తాడో అని ఎదురుచూస్తున్న తరుణంలో రాహుల్ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి చెప్పాడు. తానూ త్వరలో తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు రాహుల్. ఐతే రాహుల్ ఇప్పటికే పెళ్లి కూడా చేసుకున్నాడని వార్తలున్నాయి. ఇందులో ఏది నిజమో కానీ రాహుల్ మాత్రం.. తన భార్య గర్భవతిగా ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ‘మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్’ అని కామెంట్ పెట్టాడు. రాహుల్ త్వరలో తండ్రి కాబోతున్నానని పెట్టిన పోస్టు పై నెటిజన్లు ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. ‘అసలు పెళ్లి ఎప్పుడు అయింది బ్రో’, ‘లివింగ్ టు గెదర్ లో ఫాదర్ అయ్యావా అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ తన భార్యకి లిప్ కిస్ ఇస్తున్న పిక్ షేర్ చేసిన రాహుల్.. ఇప్పటివరకు ఎలాంటి పెళ్లి పిక్ కానీ, వీడియో అభిమానులతో పంచుకోలేదు. కానీ ఇంతలో తన భార్య గర్భవతి అని ప్రకటించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా రాహుల్ తండ్రి కాబోతుండడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.