Comedian Riaz introduced his wife on the show
mictv telugu

భార్యను షోకు తీసుకొచ్చిన కమెడియన్ రియాజ్.. సద్దాం మాటలకు సిగ్గు

July 29, 2022

పండుగల కోసం ప్రత్యేక షోలు చేసే టీవీ ఛానెళ్లు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న బోనాల నేపథ్యంలో పలు షోలు ప్లాన్ చేశాయి. అందులో జీ తెలుగు ‘జీతెలుగు వారి జాతర’ పేరుతో ప్రోగ్రాం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ ప్రొమో విడుదలవగా, తాజాగా రెండో ప్రోమోను రిలీజ్ చేశారు. కమెడియన్ రియాజ్‌ జంట ఈ ప్రొమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఇటీవలే పెళ్లి చేసుకున్న రియాజ్ తన భార్య యాస్మిన్‌ను షోకు తీసుకొచ్చి పరిచయం చేశారు. కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై స్టేజీ మీదకి రాగా, నూతన జంటతో పూల దండలు మార్పించారు. తర్వాత నీ భార్య ఏంటని అడిగితే యాస్మిన్ అని రియాజ్ చెప్పగా, కాదు యాస్మిన్ రియాజ్ అని సద్దాం చెప్పడంతో రియాజ్ కాస్త సిగ్గుపడ్డాడు. సద్దాం, రియాజ్‌లలో ఎవరు కామెడీ బాగా చేస్తారని యాస్మన్‌ని ప్రశ్నిస్తే రియాజ్ అని బదులిచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రొమో పూర్తి షో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుంది.