మొదట కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ కామెడీలోకి దిగాడు. ఇప్పుడేమో విలనిజం పండిస్తున్నాడు. ఒక వ్యక్తి ఇన్ని రకాలుగా రూపాంతరం చెందడం ఇదే మొదటిసారేమో. అయితే ఇదంతా ఎవరి గురించి చెబుతున్నా అనుకుంటున్నారా. అదేనండి మన సునీల్ గురించి.
ఒక ఢిఫరెంట్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ సునీల్. బొద్దుగా ఉండే సునీల్ తన పర్శనాలిటీకి తగ్గట్టు పాత్రలు ఎంచుకుంటూ కమెడియన్ గా దూసుకుపోయాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా తనను తాను మార్చుకుని హీరోగా కూడా ఎదిగాడు. సునీల్ ను స్లిమ్ గా మార్చేసి మర్యాద రామన్న సినిమాతో హీరోగా ఎస్టాబ్లిష్ చేశాడు రాజమౌళి. దాని తర్వాత పూలరంగడుతో మరో హిట్ కొట్టాడు.తరువాత వరుసపెట్టి హీరోగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే హీరోగా తనని తాను పెర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసుకునే కథలు తరువాత ఆశించిన స్థాయిలో పడలేదని చెప్పాలి. చాలా సినిమాలు ఎవరేజ్ టాక్ తెచ్చుకోగా కొన్ని డిజాస్టర్ అయ్యాయి.దీంతో మళ్ళీ తనని తను మార్చుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేశారు. అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
డిస్కో రాజా సినిమాలో విలన్ గా మొదటి సారి ఎంట్రీ ఇచ్చాడు సునీల్. తర్వాత కలర్ ఫోటో సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇక పుష్ప సినిమాలో అయితే సుకుమార్ సునీల్ ని మెయిన్ విలన్ గా ఎస్టాబ్లిష్ చేసి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాడు. ఈ సినిమా దెబ్బతో విలన్ గా సునీల్ కెరియర్ పూర్తిగా టర్న్ అయిపోయిందని చెప్పాలి.ప్రస్తుతం విలన్ గా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక పుష్ప 2లో కూడా అతని పాత్ర కీలకంగా ఉండబోతుంది.కార్తి కామెడీ ఎంటర్టైనర్ జపాన్ లో కూడా సునీల్ విలన్ గా కనిపిస్తున్నాడు. శివకార్తికేయాన్ మవీరన్ విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాలలో పవర్ ఫుల్ పాత్రలలో కనిపిస్తున్నాడు. వీటిలో మూడు పాన్ ఇండియా సినిమాలు కాగా రెండు ద్విభాషా చిత్రాలు కావడం విశేషం. ఇక హిందీ సినిమాలలో కూడా అతనిని విలన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.
300కి పైగా సినిమాలు చేసిన సునీల్ తన కెరీర్ లో ఎత్తులు-పల్లాలు అన్నీ చూసేసాడు. ఇప్పడు పాన్ ఇండియా విలన్ గా మారిపోయాడు. ఇది ఇక్కడతో ఆగుతుందా. ఇంకా ఏమైనా క్యారెక్టర్లు చేస్తాడా అన్నది కాలంతో పాటూ మనమూ వేచి చూడాల్సిందే.