కమెడియన్ వేణు మాధ‌వ్ చ‌నిపోయాడంటూ అస‌త్య ప్ర‌చారం - MicTv.in - Telugu News
mictv telugu

కమెడియన్ వేణు మాధ‌వ్ చ‌నిపోయాడంటూ అస‌త్య ప్ర‌చారం

September 25, 2019

venu madhav...

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలుగు చిత్రసీమలో హాస్యనటుడిగా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు. సినీ నటులు జీవిత-రాజశేఖర్‌లు ఆస్పత్రికి వచ్చి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

అయితే వేణుమాధవ్ చనిపోయారంటూ మంగళవారం విపరీతంగా ప్రచారం జరిగింది. అది తప్పుడు ప్రచారమమని.. వేణు మాధవ్ ఇంకా బతికేఉంటారని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. అయితే గ‌తంలోను వేణు మాధ‌వ్ బ‌తికి ఉండ‌గానే ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలో వేణు మాధ‌వ్ మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ, త‌ను బ‌తికే ఉన్నానని చెప్పుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఇలాంటి అసత్య కథనాలపై విపరీతంగా ప్రచారం జరుగుతుంది.