వనితారెడ్డి బ్యాచ్ పరారైంది..! - MicTv.in - Telugu News
mictv telugu

వనితారెడ్డి బ్యాచ్ పరారైంది..!

December 15, 2017

సినీ హాస్యనటుడు కాలె విజయ్‌సాయి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. తాను నిర్దోషినని వాదించిన ఆయన భార్య వనితారెడ్డి కనిపించడం లేదు. ఇతర నిందితులైన న్యాయవాది శ్రీనివాస్, శశిధర్‌లు కూడా పరారయ్యారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే పరారైనట్లు భావిస్తున్నారు.ఈ కేసులో విచారణకు రావాలని వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ ఆమె కనిపించలేదు. ఆమె తల్లిని విచారించగా వనిత ఎక్కడికెళ్లిందో తనకు తెలియదని చెప్పింది. తర్వాత గుచ్చిగుచ్చి అడగ్గా.. సూర్యాపేటలో ఉన్నట్లు పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. వనిత తీవ్ర జ్వరంతో బాధపడుతోందని, ఆమెకు బదులు తాన పోలీస్‌ స్టేషన్‌కు వస్తానని చెప్పింది. మరోపక్క.. న్యాయవాది శ్రీనివాస్‌ ఆచూకీ కూడా తెలియడం లేదు. అతని ఫోన్ పనిచేయడం లేదు. శశిధర్ కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ముగ్గురి నిందితులకు సంబంధించిన మూడు నెలల ఫోన్ కాల్‌డేటా సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. విజయ్ ఈ నెల 11న యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులోని శ్రీనివాస విలేజ్‌లోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డం తెలిసిందే. ‘నా చావుకు వనితతోపాటు న్యాయవాది శ్రీనివాస్‌, శశిధర్‌ కారణం’ అని అతడు ఆత్మహత్యకు ముందు విజయ్‌ తాను తీసుకున్న సెల్ఫీ వీడియో ఆరోపించాడు.