comedy skit on naresh and pavithra.. hyper aadi satires
mictv telugu

శ్రీదేవి డ్రామా కంపెనీలో నరేశ్, పవిత్రల స్కిట్.. హైపర్ ఆది సెటైర్లు

July 25, 2022

సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్‌ల గురించి వచ్చిన వార్తలు గత వారం రోజుల వరకూ హల్‌చల్ చేశాయి. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని, అయితే వారి బంధాన్ని నరేశ్ మూడవ భార్య రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్ర ఉన్నారని తెలుసుకున్న రమ్య నేరుగా అక్కడకు వెళ్లి గొడవకు దిగడం, నరేష్, పవిత్రలపై చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేయడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది పెయిర్ గా మారాయి. సోషల్ మీడియా వచ్చిన ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు వారిద్దరిని విపరీతంగా ట్రోల్ చేశారు. మీమ్స్‌ క్రియేట్‌ చేసి వైరల్‌ చేశారు.

అంతటితో ఆగక ఇప్పుడు వారిద్దరి తీరు స్కిట్‌ల రూపంలో కూడా బుల్లితెరపై దర్శనమిచ్చాయి. ఓ ప్రముఖ చానెల్ ల ప్రసారమవుతురన్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో సీరియల్స్, కామెడీ షోస్ కి సంబంధించిన జంటలను దించారు. ఈ జంటల్లో సీనియర్ హీరో నరేశ్‌గా జబర్ధస్త్ కామెడీ స్టార్ నరేశ్.. పవిత్రా లోకేశ్‌గా యూట్యూబర్ పవిత్ర లు జంటగా చేశారు. హైపర్ ఆది వీరిని పరిచయం చేస్తూ.. వీడు నరేష్, ఆమె పవిత్ర… అయితే ఇంకా… అంటూ సైలెంట్ అయ్యాడు. ఆ సన్నివేశాలను చూసి జడ్జ్‌గా వచ్చిన ప్రగతి, సంఘవి, హైపర్‌ ఆది, ఆటో రామ్‌ ప్రసాద్‌ నుంచి సెట్‌లో ఉన్న అందరూ నవ్వులు పూయించారు. ఈ స్కిట్‌ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. మరోవైపు హైపర్ ఆది సెటైర్ పై నెటిజెన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆది చివరకు నరేష్, పవిత్రను కూడా వదల్లేదని వాపోతున్నారు.