’పులి’, ‘యుముడు’ వంటి అరవ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన హాస్యనటుడు రోబో శంకర్ కష్టాలు కోరి తెచ్చుకున్నాడు. అటవీ శాఖ అధికారులు అతని ఇంటిపై దాడి చేసి విదేశీ చిలులకు విముక్తి కలిగించారు. శంకర్.. అలెగ్జాండ్రెన్ అనే దక్షిణ అమెరికా జాతి చిలుకల పంజరాల్లో పెట్టి పెంచుకుంటున్నాడు. విదేశీ పక్షులను పెంచుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అటవీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని, ఆ పక్షులకు సహజమైన తిండి పెట్టాలి. శంకర్ అవేమీ పాటించకుండా పెంచుతున్నట్లు తెలుస్తోంది. శంకర్ వాటిని వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుతుంటాడు. విషయం అటవీ అధికారులకు తెలిసింది. చెన్నైలోని అతని ఇంటిపై దాడి చేసి పక్షులను జప్తు చేశారు. రోబో శంకర్ తోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. అతనికి రూ. 5 లక్షల జరిమాన పడే అవకాశం ఉంది.