Commissioner orders farmers in AP to undergo e-KYC
mictv telugu

ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 12 వరకే గడువు : కమిషనర్ ప్రకటన

October 4, 2022

Commissioner orders farmers in AP to undergo e-KYC

ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం రైతులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు. పంటల బీమా, ఇతర పథకాల అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీ లోపు ఈ – కేవైసీ చేయించుకోవాలని కోరారు. సామాజిక తనిఖీల కోసం ఈ – కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాను ఈ నెల 16వ తేదీ నుంచి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు. ఇప్పటికే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వో కలిపి 90 శాతం ఈ – క్రాప్‌ను ధ్రువీకరించినట్టు తెలిపారు. రైతులందరి మొబైల్ నెంబర్లకు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రంలో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని వివరించారు. అటు రాష్ట్రంలో ఇప్పటివరకు ఖరీఫ్ సీజన్లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్టు కమిషనర్ తెలిపారు.