బాలల చిత్రోత్సవ జ్యూరీ సభ్యులు వీరే - MicTv.in - Telugu News
mictv telugu

బాలల చిత్రోత్సవ జ్యూరీ సభ్యులు వీరే

October 25, 2017

హైదరాబాద్ నగరంలో  20వ అంతర్ఝాతీయ బాలల చలన చిత్రోత్సవాల సందడి మొదలైంది. నవంబర్ 8 నుంచి 14 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చెయ్యటానికి న్యాయనిర్ణేతల కమిటీని  ప్రకటించారు.

19 మంది సభ్యులున్న ఈ జ్యూరీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. వారిలో ప్రభాకర్ జైనీ, అక్కినేని అమల, వారాల ఆనంద్, పద్మినీ నాగుల పల్లి, ఉమా మహేశ్వర్రావులు వున్నారు. అమెరికా, స్పెయిన్, జర్మనీ, ఉక్రెయిన్ వంటి పలు దేశాలకు చెందిన సభ్యులు జ్యూరీలో వుండటం విశేషం.