Commoners Fires On Bigg Boss Telugu 6 Team And Host Nagarjuna
mictv telugu

బిగ్‌బాస్‌లో సామాన్యుడికి అవకాశం ఉండదా.? మండిపడుతున్న నెటిజన్లు

September 5, 2022

వన్ టైమ్ గోల్డోన్ ఆఫర్.. టికెట్ టూ బిగ్‌బాస్ సీజన్ 6.. సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. పలు ప్రకటనలు చేసిన హోస్ట్ నాగార్జున, మా టీవీ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున మే 26న అధికారికంగా ఓ ప్రోమో విడుదల చేసి, ఆ తర్వాత దానిని యూట్యూబ్ నుంచి తొలగించారు. కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

నాగార్జున మాటలు నమ్మి ఎంతోమంది సామాన్యులు బిగ్ బాస్‌ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు, వీడియోలు వచ్చాయి. అయితే ఆదివారం నాటి ఎపిసోడ్‌లో 21 మంది కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి పంపారు. వారిలో ఒక్కరు కూడా సామాన్యుడు లేడు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు.

వీరిలో యూట్యూబర్‌ ఆది రెడ్డిని కామనర్ అని చెప్పిన హోస్ట్ నాగార్జున.. అదే నోటితో అతను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు. ఇలా చీట్ చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్.