కామన్వెల్త్ గేమ్స్‌లో మనకు మళ్లీ పసిడి.. - MicTv.in - Telugu News
mictv telugu

కామన్వెల్త్ గేమ్స్‌లో మనకు మళ్లీ పసిడి..

April 7, 2018

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న  21 కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌  దూసుకుపోతోంది. తన ఖాతాలో తాజాగా మరో పసిడి పతకాన్ని పడేసుకుంది. 77 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ పురుషుల విభాగంలో సతీశ్‌కుమార్‌ శివలింగం స్వర్ణపతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఇప్పటి వరకూ భారత్‌ ఖాతాలో 3 స్వర్ణాలు, 1 కాంస్యం, 1 రజత పతకాలు చేరాయి.వెయిట్‌ లిఫ్టర్లు మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం), దీపక్‌ లాటెర్‌ ( కాంస్యం),  గురురాజా(రజతం) గెలుకుచుకున్నారు. ఈ విజయాలు భారతీయులను ఆనందంలో ఓలలాడిస్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చేశారు. సుశీల్ కుమార్ కు కోవింత్ ట్విటర్లో అభినందనలు తెలిపారు.