Communal issue Britain Leicester hindu mulilm india Pakistan cricket match
mictv telugu

బ్రిటన్‌లో హిందూ-ముస్లిం మతఘర్షణలు.. అరెస్టులు

September 19, 2022

Communal issue Britain Leicester hindu mulilm india Pakistan cricket match

భారత్, పాకిస్తాన్‌ల క్రికెట్ మ్యాచ్ రెండు మతాల మధ్య చిచ్చుపెట్టింది. బ్రిటన్‌లోని లేస్టర్ నగరంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఘర్షణలు, జెండాలు పీకేయడం వంటి సంఘటనలతో స్థానికులు ఇదెక్కడి గొడవరా బాబూ అని బెంబేలెత్తిపోయారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు.అరెస్టయిన యువకుల్లో కొందరి వద్ద కత్తులు దొరికాయి.

ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ తర్వాత హింస చెలరేగింది. 18, 20 ఏళ్ల వయసున్న యువకులు వీధుల్లో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. మెల్టన్ ప్రాంతంలో ఓ ప్రార్థన స్థలంలోని జెండా తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు సీసాలు విసిరిరారు. ఓ దుకాణం వద్ద ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియోలను సేకరించిన పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. మూతికి గుడ్డలు కట్టుకున్న యువకులు భయోత్పాతం సృష్టించారని, సకాలంలో నిందితులను గుర్తించి ముప్పు తప్పించామని పోలీసులు చెబుతున్నారు.