కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతున్న మనిషిని చేత్తో పట్టకుని కాపాడిన రియల్ హీరో - MicTv.in - Telugu News
mictv telugu

కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతున్న మనిషిని చేత్తో పట్టకుని కాపాడిన రియల్ హీరో

June 10, 2022

ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్‌పై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడో యువకుడు. ట్రాక్‌పై పడి ఉన్న అతడిని చూసి మిగతావారంతా ప్రాణ భయంతో వెనుకడుగేసినా.. 20 ఏండ్ల టోని ఫెర్రీ అనే యువకుడు మాత్రం.. తన ప్రాణాలకు తెగించి చాకచక్యంగా ఆ వ్యక్తిని ప్రమాదం నుంచి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చికాగో లో జరిగిన ఈ సంఘటనలో.. బాధితుడు 600 వోల్ట్‌ల కరెంట్‌ పాస్ అవుతున్న ఎలక్ట్రిక్ ట్రాక్ పై పడి షాక్ తో కొట్టుకుంటుండగా.. టోని ఆ పట్టాలపై దూకి.. చాలా జాగ్రత్తగా అతడిని అక్కడి నుండి బయటకు లాగుతాడు. ప్రాణాపాయం నుంచి కాపాడతాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహిసించిన ఆ కుర్రాడిని సన్మానించిన ఓ బిజినెస్ మెన్.. ఒక ఆడీ కారును కూడా బహుమతిగా అందజేశాడట.