విమాన సంస్థల కక్కుర్తి.. ఏరోబ్రిడ్జీ బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

విమాన సంస్థల కక్కుర్తి.. ఏరోబ్రిడ్జీ బంద్

March 15, 2022

bhfh

దేశంలోని విమాన సంస్థలు డబ్బు ఆదా చేయడానికి ఏరోబ్రిడ్జీలను వాడకూడదని నిర్ణయించుకున్నాయని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. దీని వల్ల వృద్ధులు ఇబ్బంది పడుతూ మెట్ల ద్వారా విమానం ఎక్కుతున్నారని వెల్లడించింది. అలా చేసే ప్రైవేటు విమాన సంస్థలకు జరిమానా విధించాలని సిఫార్సు చేసింది.

ఏరోబ్రిడ్జీ అనేది మెట్రో స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో మనకు సాధారణంగా కనిపించే ఎస్కలేటర్ లాంటిది. వాటిపై మనం నిలబడితే అదే మనల్ని పైకి తీసుకెళ్తుంది.  అయితే విమానాశ్రయాల్లో ఏరోబ్రిడ్జీ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించడం లేదని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఏరోబ్రిడ్జీని ఉపయోగిస్తే సదరు విమానాశ్రయానికి సంస్థలు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు 2018లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏరోబ్రిడ్జీలను తప్పనిసరిగా వాడేలా అన్ని విమాన సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానా విధించాలని కమిటీ కోరింది.