భారీగా తగ్గిన బూస్టర్ డోసు ధరలు.. కంపెనీల ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా తగ్గిన బూస్టర్ డోసు ధరలు.. కంపెనీల ప్రకటన

April 9, 2022

bb

కరోనా నుంచి రక్షణ కోసం వినియోగిస్తున్న వ్యాక్సిన్ మూడో డోసు ధరలను ఆయా కంపెనీలు భారీగా తగ్గించాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరం, భారత్ బయోటెక్‌లు బూస్టర్ డోసును రూ. 225లకే అందిస్తామని ప్రకటించాయి. ఇంతకుముందు సీరం సంస్థ తన కోవిషీల్డ్‌ను రూ. 600 గా ప్రకటించింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ధరను రూ. 1200 లుగా నిర్ణయించింది. దాంతో ధర ఎక్కువైందన్న వాదన రావడంతో ఇరు కంపెనీలు ధరలపై పునరాలోచించి రెండు వ్యాక్సిన్లనూ రూ. 225లకే సరఫరా చేస్తామని వెల్లడించాయి. కాగా, ఇప్పటికే రెండు డోసులను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా  అందించింది. బూస్టర్ డోసును ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వయో వృద్ధులకు ఫ్రీగా ఇస్తోంది. మిగిలిన వయోజనులందరూ ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో డబ్బులిచ్చి కొనుక్కోవాలని తేల్చి చెప్పింది.