Companies that increased the price of milk
mictv telugu

వినియోగదారులకు మరో షాక్.. పాల ధర పెంచిన కంపెనీలు

August 16, 2022

Companies that increased the price of milk

ఇప్పటికే అన్ని రకాలుగా పెరిగిన ధరల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో షాక్ తగిలింది. పాల ధరను పెంచుతున్నట్టుగా అమూల్, మదర్ డెయిరీలు వేర్వేరుగా ప్రకటించాయి. పాల సేకరణ, ఇతర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.

లీటరుకి రూ. 2 చొప్పున పెంచుతున్నాయని ఆగస్టు 17వ తేదీ బుధవారం నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడించాయి. ఈ మేరకు వివిధ కేటగిరీల్లో పెంచిన ధరల వివరాలను ప్రజలకు వివరించాయి. అమూల్ గోల్డ్ ప్యాకెట్ ధర రూ. 31, అమూల్ తాజా ప్యాకెట్ ధర రూ. 25కి, అముల్ శక్తి ప్యాకెట్ ధర రూ. 28కి పెంచుతున్నట్టు పేర్కొంది. అటు మదర్ డెయిరీకి సంబంధించి ఫుల్ క్రీమ్ పాల ధర రూ. 61కి చేరింది. టోన్డ్ పాల ధర రూ. 51కి, డబుల్ టోన్డ్ పాల ధర రూ. 45కి, టోకుగా ఇచ్చే పాల ధర రూ. 48కి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ వంటి చోట్ల పెంచిన ధరలు అమల్లోకి రాగా, మిగతా ప్రాంతాలకు బుధవారం నుంచి పెంచిన రేట్లను అమలు చేస్తున్నట్టు తెలిపాయి.