Compassion rules in TS RTC..circular issued
mictv telugu

టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాలు..సర్క్యులర్ జారీ

July 8, 2022

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాలకు ఎండీ సజ్జనార్ సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ట్విటర్‌లో గురువారం ‘బ్రెడ్ విన్నర్స్ స్కీమ్’ పేరుతో ఆయన సర్క్యులర్‌ను పోస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ సిబ్బందిగా సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు.. కొన్నేళ్లుగా ఈ కొలువుల కోసం ఎదురుచూస్తున్నాయి. డ్యూటీ చేస్తూ గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ముందుగా కొలువులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్-2 డ్రైవర్లు, కండక్టర్లు, కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను ఏకమొత్తం వేతనం పై నియమించనున్నారు. కారుణ్య నియామకాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జారీ చేయడంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

‘ఆర్ధిక పరిస్థితితోపాటు కరోనా కారణంగా 2019 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టలేకపోయాం. పెండింగ్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని దశల వారీగా నియామకాలు చేపడతాం. గతంలో ఎంపికైన వారిని తక్షణమే నియమిస్తాం. కారుణ్య నియామకం కింద ఎంపికై వారు మూడేళ్లపాటు సర్వీసు పూర్తి చేసిన వారికి పనితీరుపై పరీక్షను నిర్వహిస్తాం. అందులో 60 శాతం మార్కులు సాధిస్తే పూర్తిస్థాయి స్కేలు మేరకు సర్వీసులోకి తీసుకుంటాం. ఈ మూడేళ్ల వ్యవధిలో నియమితులైన ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 240 రోజులు పనిచేసి ఉండాలి. గ్రేడ్-2 డ్రైవరకు రూ.10 వేలు, గ్రేడ్-2 కండ క్టరుకు రూ.17 వేలు, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామికు రూ. 15 వేల చొప్పున ఏకమొత్తం వేతనం చెల్లిస్తాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామక అర్హులకు లేఖలు పంపుతాం. వారు ఉద్యోగంలో చేరేం దుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చాక రీజినల్ మేనేజర్లు ఖాళీల మేరకు నియామక ప్రక్రియను చేపడతారు” అని సజ్జనార్ పేర్కొన్నారు.