అన్న జగన్‌తో పంచాయితీ ఉంటే ఆంధ్రాలో తేల్చుకోవాలని, తెలంగాణలో ఏం పని? అని మంత్రి పువ్వాడ అజయ్ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. ఖమ్మంలో చేస్తున్న పాదయాత్రలో వైఎస్ షర్మిల.. ఇటీవల మంత్రిని విమర్శించారు. దాంతో కౌంటర్‌గా మాట్లాడిన పువ్వాడ.. షర్మిలకు దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీచేయాలని సవాల్ విసిరారు. ‘కబ్జాలు, దందాలు చేసిన కుటుంబం మీది. మీ తండ్రి, అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తుంటే సిగ్గేస్తుంది. మంత్రి కాకపోయి ఉంటే, మీ అన్నలా డబ్బులిచ్చి పదవి తీసుకోవాలా? ఎవరైనా సరే, పనిచేసిన వారిని గుర్తించి కేసీఆర్ పదవులిచ్చారు. నువ్వు పోటీ చేస్తానన్న పాలేరు నియోజకవర్గంలోనూ నా దమ్మేంటో చూపిస్తా’నని పరుషంగా మాట్లాడారు.