జీయర్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అట్రాసిటీ పెట్టాలని.. - MicTv.in - Telugu News
mictv telugu

జీయర్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అట్రాసిటీ పెట్టాలని..

March 16, 2022

కోట్లాది భక్తులు కొలిచే సమ్మక్క-సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్‌స్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. జీయర్‌కు ఆదివాసీ దేవతల గురించి తెలియదని, ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను గాయపరిచాయని సంఘం నేత మల్లుదొర మండిప్డారు.

సమతామూర్తి పేరుతో జనం దగ్గర సొమ్ము వసూలు చేస్తున్నారని, ఆయనకు తమ దేవతల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. సమ్మక్క, సారలమ్మలను కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.