మోహన్‌బాబు కుటుంబంపై హెచ్చార్సీలో ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్‌బాబు కుటుంబంపై హెచ్చార్సీలో ఫిర్యాదు

March 5, 2022

7

సినీ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణుపై నాయి బ్రాహ్మణ సంఘం నేతలు శనివారం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బీసీల్లోనే అత్యంత వెనుక బడిన నాయిూ బ్రాహ్మణులను కించపర్చడం సరికాదనీ, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సంఘం అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆధునిక యుగంలోనూ కులాల పేరుతో దాడులు జరగడం సిగ్గు చేటు. ఇలాంటివి అరికట్టాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా మాకు కూడా ప్రత్యేక చట్టం కావాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా మచ్చలేకుండా పని చేస్తున్న నాగశ్రీనుపై అక్రమంగా దొంగతనం కేసు పెట్టడమే కాకుండా, కులం పేరుతో దూషించి మా మనోభావాలను కించపర్చారు. సీసీ టీవీ ఫుటేజ్ బయట పెడితే ఎవరు దొంగో తెలుస్తుంద’ని వెల్లడించారు. కాగా, నాగశ్రీను మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం చేశాడని ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం తాను దొంగతనం చేయలేదంటూ నాగశ్రీను వీడియో విడుదల చేయడంతో వివాదం పెద్దరూపు దాల్చుకుంది.