Home > Featured > వైఎస్ షర్మిలపై స్పీకర్‌కి ఎమ్మెల్యేల ఫిర్యాదు.. చర్యలకు ఆస్కారం!

వైఎస్ షర్మిలపై స్పీకర్‌కి ఎమ్మెల్యేల ఫిర్యాదు.. చర్యలకు ఆస్కారం!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. షర్మిల ప్రస్తుతం చేస్తున్న పాదయాత్రలో పలువురు ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిరాధార ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, దాంతో తమ ప్రతిష్టకు భంగం కలుగుతోందని వాపోయారు. పరిశీలించిన స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు పరిశీలిస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. కాగా, వనపర్తి ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో తనపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన షర్మిల మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నిరంజన్ రెడ్డి డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. కాగా, తెలంగాణలో షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దాంతో వనపర్తి నియోజకవర్గంలోని కొత్తకోట బస్టాండులో పైలాన్ ఆవిష్కరించారు.

Updated : 13 Sep 2022 8:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top