Complete ban on Tapas.. Diwali is quiet this time too
mictv telugu

టపాసులపై పూర్తి నిషేధం..ఈసారి కూడా నిశ్మబ్దంగానే దీపావళీ

September 7, 2022

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, త్వరలోనే రానున్న దీపావళీ పండగను పురస్కరించుకొని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టపాసులపై పూర్తి నిషేధాన్ని విధిస్తూ, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో..”అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నాం. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం. ఈసారి ఆన్‌లైన్ విక్రయాలపై కూడా ఆంక్షలు విధించాం. ఈ నిషేధాజ్ఞలు వెంటనే అమల్లోకి వస్తాయి. జనవరి 1, 2023 వరకు అమల్లో ఉంటాయి. సాధారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం మిగతా నగరాలతో పోలిస్తే, ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాణసంచాతో గాలి నాణ్యత మరింత తగ్గుతోంది” అని ఆయన పేర్కొన్నారు.

ఇక, గత సంవత్సరం దీపావళికీ కూడా అరవింద్ కేజీవాల్ సర్కారు ఆంక్షలు విధించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, టపాసులు పేల్చిన వారిపై చర్యలు కూడా తీసుకుంది. ఈ క్రమంలో మరోసారి అదే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈసారి కూడా ఢిల్లీలో దీపావళీ పండగ ఎలాంటి టపాసులు మోత లేకుండానే జరగనుంది.