కంప్యూటర్ ‘మౌస్’ సృష్టికర్త ఇక లేరు - MicTv.in - Telugu News
mictv telugu

కంప్యూటర్ ‘మౌస్’ సృష్టికర్త ఇక లేరు

August 4, 2020

Computer Mouse Creator No more

కంప్యూటర్‌లో మౌస్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కంప్యూటర్‌లో ఎంతో కీలకమైన పరికరం. అలాంటి మౌస్ సృష్టికర్త ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయారు. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేసిన విలియమ్ బిల్ ఇంగ్లీష్ (91) ఇటీవల మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజుల క్రితం మరణించారని సమాచారం. 

విలియమ్ బిల్ ముందుగా నేవిలో పని చేశారు. కొంత కాలం రిటైర్మెంట్ తీసుకొని కంప్యూటర్ ఇంజనీరుగా మారారు. ఎస్‌ఆర్‌ఐ (శ్రీ) ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ కొంత మంది పరిశోధకులతో కలిసి మౌస్ తయారీలో చాలా కీలక పాత్ర పోషించారు. మౌస్‌ను ప్రపంచానికి  పరిచయం చేసిన వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటివాడు. అతని మొదటి ఆవిష్కరణలో  కే బటన్‌తో కూడిన చెక్క బాక్స్ దాని కింది భాగంలో 90-డిగ్రీల కోణాల్లో రెండు రోలింగ్ చక్రాలు  ఏర్పాటు చేశాడు. 1960 సంవత్సరంలో తొలిసారి దీన్ని చెక్కతో తయారు చేశారు. ఆ తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయి. కాగా 1929 జనవరి 27 పుట్టిన విలియమ్ తండ్రి కూడా అరిజోనాలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పని చేశారు.