కట్-కాపీ-పేస్ట్ సృష్టికర్త ఇకలేరు - MicTv.in - Telugu News
mictv telugu

కట్-కాపీ-పేస్ట్ సృష్టికర్త ఇకలేరు

February 20, 2020

Computer scientist behind cut, copy and paste passed away aged 74

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్‌లను వినియోగించేవాళ్లకు కట్, కాపీ, పేస్ట్‌ సుపరిచితమే. ఈ టెక్ యుగంలో ఎన్నో సార్లు వీటిని వియోగించి ఉంటారు. మరి దీన్ని సృష్టికర్త లారీ టెస్లర్‌ గురించి తెలుసా? 74 ఏళ్ల లారీ టెస్లర్‌ సోమవారం రోజున మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. 1945లో న్యూయార్క్‌లో జన్మించిన లారీ టెస్లర్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ విద్యను అభ్యసించారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్‌, ఆపిల్, యాహూ, పీఏఆర్‌సీ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు.

టెస్లర్‌ 1970లో జిరాక్స్‌ పాలో ఆల్టో రీసెర్చ్‌ సెంటర్‌‌లో పనిచేస్తున్న సమయంలో ఆయన కట్, కాపీ, పేస్ట్‌ను అభివృద్ధి చేశారు. పాత రోజుల్లో ముద్రించిన పత్రాలను కత్తిరించి వాటిని మరో చోట అతికించే విధానం స్ఫూర్తితో ఆయన కట్, కాపీ, పేస్ట్‌ని రూపొందించారు. ఆపిల్ సంస్థ లిసా కంప్యూటర్లలో దీన్ని ఉపయోగించడంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆపిల్‌ సంస్థతో కలిసి టెస్లర్‌ 20 ఏళ్లు పనిచేశారు. ఈ రోజుల్లో మనం వాడుకలో ఉపయోగిస్తున్న బ్రౌజర్‌ అనే పదాన్ని కూడా 1976లో టెస్లర్‌ సూచించారు.