వైవిధ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తీస్తున్నారు తెలుగు దర్శకులు. సీనియర్లతో పాటు, యంగ్ జనరేషన్ కూడా తమ డైరెక్షన్ టాలెంట్ చూపిస్తూ హిట్లు కొడుతున్నారు. డెబ్యూ మూవీస్‌తోనే హీరోలు కూడా తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో త్వరలో రాబోయే ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ కూడా ఈ కోవలోకే చెందినట్లు అనిపిస్తుంది. దీపక్ సరోజ్, తన్వినేగి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పోస్టర్‌లను చిత్రబృందం తాజాగా రిలీజ్ చేసింది. పోస్టర్‌లతోనే సినిమాలో హీరో క్యారెక్టర్‌రైజేషన్ ఎంత బోల్డ్‌గా ఉంటుందో చెప్పేశారు.
ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను నిన్న ఆవిష్కరించారు. ‘అసాధారణ జీవిత/ప్రేమ కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్ కాగా.. రెండు పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్‌లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లు, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో దీపక్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. మరొక పోస్టర్‌లో హీరోయిన్ తన్వి నేగితో అతను లిప్ లాక్ చేస్తున్నాడు. మొత్తానికి పోస్టర్లు చూస్తుంటే ‘సిద్ధార్థ్ రాయ్’ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
First look of #SiddharthRoy Starring #DeepakSaroj #TanviNegi pic.twitter.com/HKOuoZ9jcb
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) February 15, 2023
అయితే ఇందులో కనిపిస్తున్న హీరో దీపక్ సరోజ్.. అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ స్టైల్‌లో కనిపిస్తున్నా.. మనందరికీ బాగా తెలిసిన కుర్రాడే. పలు తెలుగు సినిమాల్లో బాలనటుడిగా అందరినీ ఆకట్లుకున్నాడు. ‘అతడు’లో బ్రహ్మనందం తన శరీరం ఎంత గట్టిగా ఉందో చూడమని చెబితే పొట్టపై టచ్ చేసి ‘మన స్కూల్ బెంచ్‌లాగా ఎంత గట్టిగా ఉందిరా!’ అంటూ నవ్వులు పంచిన బాలుడు ఇతడే. ‘అన్నయ్యా.. సాంబార్‌లో చికెన్ నంజుకో.. బాగుంటది’ అంటూ ఓ చిట్లి చెల్లి ‘భద్ర’సినిమాలో తన అన్నకు చెప్పిన డైలాగ్ కూడా ఈ అబ్బాయి గురించే. ‘ఆర్య’, ‘భద్ర’, ‘మిణుగురులు’, ‘లెజెండ్’ వంటి హిట్ మూవీస్‌లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా మారాడు.