కొండెక్కిన వంట నూనె.. లీటర్ ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన వంట నూనె.. లీటర్ ఎంతో తెలుసా?

March 7, 2022

nnnn

రష్యా – ఉక్రెయిన్ దేశాల యుద్ధం కారణంగా వంట నూనె ధర కొండెక్కింది. దీంతో వంటింట్లో మంట రేపింది. ఆయిల్ ధరలు మార్కెట్లో అమాంతం పెరిగిపోవడంతో సామాన్యుడి గుండె గుబెల్‌ మంటోంది. నిన్న మొన్నటి వరకూ రూ. 120గా పామాయిల్‌ ధర.. ఏకంగా రూ.165 పెరిగింది. మార్కెట్లో వ్యాపార వేత్తల వంట నూనెలు ఎమ్మార్పీ కన్నా రూ.10 వరకు తక్కువ ధరకే అమ్ముతారు. అయితే, ప్రస్తుతం ఎమ్మార్పీ కన్నా రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

మార్కెట్లో ధరలు పెరగడంతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజిలెన్స్ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తిరుపతిలో ఎడిబుల్ ఆయిల్స్ ధరలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు నిర్వహిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాకుతో అధిక ధరలకు నిత్యావసరాలు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు జిల్లా వ్యాప్తంగా దాడులు చేపట్టారు. తూనికలు కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్త దాడుల్లో వ్యాపారుల అక్రమాలు వెలుగు చూశాయి. అధిక ధరలకు వంట నూనెలు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. చిత్తూరులో 3, తిరుపతిలో 5, పిలేరులో 2 కేసులు నమోదయ్యాయి.