Conditions outside are not good.. Stay there: KCR
mictv telugu

పరిస్థితులు మంచిగలేవు..అక్కడే ఉండండి:కేసీఆర్

July 12, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బయట పరిస్థితులు అసలు మంచిగలేవని, ఆయా జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మీ జిల్లా, మీ ప్రాంతాన్ని వదిలి బయటికి రావొద్దని, మీకూ కేటాయించిన ఆఫీసుల్లోనే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్..సోమవారం రాత్రి ఓ ముఖ్యమైన ఆదేశాలను జారీ చేశారు.

ప్రగతిభవన్‌లో సోమవారం సుమారు 12 గంటలపాటు ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దామోదరావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ”తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. కావున ఆయా జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకోని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. భారీ వర్షాల కారణంగా గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలి” అని ఆయన అన్నారు.

ఇక, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు, స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు.