రష్యాలో విపరీతంగా కండోమ్ అమ్మకాలు.. కారణమేంటంటే - MicTv.in - Telugu News
mictv telugu

రష్యాలో విపరీతంగా కండోమ్ అమ్మకాలు.. కారణమేంటంటే

March 21, 2022

kkkk

ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్లిన రష్యాకు పాశ్చాత్య దేశాలు పెట్టిన ఆంక్షల సెగ ఆ దేశ ప్రజలకు తాకుతోంది. డాలర్‌తో రూబుల్ విలువ పడిపోతున్న నేపథ్యంలో వస్తువుల ధరలు పెరుగుతాయని పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార సంబంధ పదార్ధాలను రష్యన్లు ఇప్పటికే పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాటి సరసన కండోమ్ చేరింది. కండోమ్‌లను రష్యన్లు ఎగబడి కొంటున్నారు. ఒక అంచనా ప్రకారం వాటి అమ్మకాలు 15 రోజుల్లో 170 శాతం పెరిగిపోయింది. సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డు కనబడుతోంది. రష్యన్లు ఇలా కండోమ్‌లను ఎగబడి కొనడానికి కారణం ధరలు పెరుగుతాయన్న భయమే. రష్యా ఏటా 600 మిలియన్ల కండోమ్‌లను దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా 100 మిలియన్లను ఉత్పత్తి చేసుకుంటోంది. డాలర్‌తో రూబుల్ విలువ పడిపోతున్న నేపథ్యంలో కండోమ్ తయారీలో వాడే ముడిసరుకు లేటెక్స్‌ ధర పెరిగిపోతుంది. తద్వారా ఆ భారం అంతా ప్రజల మీదే పడుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కొనేసుకొని ఇంట్లో స్టాకు పెట్టుకుంటున్నారు. లేటెక్స్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. రష్యాలోని కండోమ్ మార్కెట్‌లో 95 శాతం వాటా విదేశీ కంపెనీలదే.